Bellamkonda Sreenivas: బెల్లంబాబు ఖాతాలో క్రేజీ సినిమాలు
టాలీవుడ్ లో బడా బడా ఫ్యామిలీ వారసులకు కూడా దక్కని అరంగేట్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Srinivas) కు దక్కింది. భారీ బడ్జెట్ పెట్టి బెల్లంకొండ సురేష్ తన కొడుకుతో అల్లుడు శీను(Alludu Seenu) సినిమా తీసి మంచి డెబ్యూ అందించాడు. ఆ తర్వాత జయ జానకి నాయక(Jaya Janaki Nayaka), సాక్ష్యం(Sakshyam) లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలతో పేరు, మార్కెట్ సంపాదించాడు శ్రీనివాస్.
కానీ వాటిని తర్వాత నిలబెట్టుకోలేకపోయాడు. శ్రీనివాస్ నుంచి తెలుగులో ఆఖరిగా వచ్చిన చిత్రం అల్లుడు అదుర్స్(Alludu Adhurs). ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని ఛత్రపతి(Chatrapati) రీమేక్ చేస్తే అది దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది. దీంతో శ్రీనివాస్ కు హిట్ దక్కి చాలా కాలమే అయింది.
అయినప్పటికీ శ్రీనివాస్ కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా సాగుతుంది. ఇలాంటి టైమ్ లో కూడా తన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. భీమ్లా నాయక్(Bheemla Nayak) డైరెక్టర్ సాగర్ కె చంద్ర(Sagar K Chandra) దర్శకత్వంలో టైసన్ నాయుడు చేస్తున్న శ్రీనివాస్ దాంతో పాటూ తమిళ రీమేక్ మూవీని భైరవం(Bhairavam) పేరుతో చేస్తున్నాడు. వీటితో పాటూ కొత్తగా శ్రీనివాస్ హీరోగా రెండు సినిమాలను అనౌన్స్ చేశాడు. అందులో 400 ఏళ్ల నాటి గుడి నేపథ్యంలో సాగే మిస్టిక్ థ్రిల్లర్ కాగా, మరొకటి యాక్షన్ మూవీ. ఈ నాలుగు సినిమాలు హిట్ అయితే శ్రీనివాస్ మార్కెట్ భారీగా పెరగడం ఖాయం.













