Bellamkonda Sreenivas: ఛత్రపతి రీమేక్ చేయకుండా ఉండాల్సింది

లైఫ్ లోనే ఎంతో ముఖ్యమైన మూడేళ్ల ప్రైమ్ టైమ్ ను ఛత్రపతి(Chatrapathi) రీమేక్ కోసం వేస్ట్ చేసుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas). ఆ సినిమా ఫ్లాప్ అవడంతో తిరిగి టాలీవుడ్ కు వచ్చి ఇక్కడ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్, విజయ్ కనకమేడల(Vijay Kanakamedala) దర్శకత్వంలో చేస్తున్న సినిమా భైరవం. ఈ సినిమాలో మంచు మనోజ్(Manchu Manoj), నారా రోహిత్(Nara Rohit) కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మే 30న భైరవం(Bhairavam) రిలీజవుతున్న సందర్భంగా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూల్లో పాల్గొని పలు విషయాల గురించి మాట్లాడుతున్నాడు శ్రీనివాస్. నటుడు అవకముందు తాను ముంబైలో ట్రైనింగ్ తీసుకున్నానని, ట్రైనింగ్ అయిపోయి యాక్టర్ అయ్యాక ఓ పెద్ద బాలీవుడ్ సంస్థ నుంచి తనకు ఆఫర్ వచ్చిందని, అలా ఛత్రపతి చేశానని చెప్పాడు.
2019లోనే ఛత్రపతి రీమేక్ కు సైన్ చెప్పానని శ్రీనివాస్, బాలీవుడ్ లో సినిమాలు చేసిన తెలుగు నటులు చాలా తక్కువ మంది ఉన్నారనే ఉద్దేశంతోనే ఛత్రపతి చేశానని, సౌత్ సినిమా పైగా రాజమౌళి సినిమా కాబట్టి తప్పకుండా నార్త్ లో వర్కవుట్ అవుతుందని నిర్మాత చెప్పడంతోనే ఈ రీమేక్ చేశానని, అలా రీమేక్ చేయకుండా ఉండాల్సిందని చెప్పాడు. షూటింగ్ టైమ్ లోనే ఇది వర్కవుట్ అవుతుందా లేదా అనే డౌట్ వచ్చిందని, దాని వల్ల షూటింగ్ పై కూడా పూర్తిగా దృష్టి పెట్టలేకపోయానని శ్రీనివాస్ చెప్పాడు.