కొత్త డైరెక్టర్‌పై బెల్లంబాబు నమ్మకం
హిట్లూ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ పోయే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ వెర్షన్ల రూపంలో హిందీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడని భావించి, తన క్రేజ్ వల్లే తన సినిమా డబ్బింగ్ రైట్స్ అంత మొత్తంలో అమ్ముడుపోతున్నాయనుకుని ఊహించుకుని బాలీవుడ్ లో ఛత్రపతిని రీమేక్ చేసి తన మూడేళ్ల విలువైన టైమ్ ను వేస్ట్ చేసుకున్నాడు.
తర్వాత వాస్తవాన్ని గ్రహించిన శ్రీనివాస్ టాలీవుడ్ లోనే మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్న బెల్లంబాబు త్వరగా ఆ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు.
దీని తర్వాత కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఇప్పటికే ఒక ఫాంటసీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కిష్కిందపురి అనే టైటిల్ ను ఈ సినిమా కోసం పరిశీలిస్తున్నారు. ఇది కాకుండా శ్రీనివాస్ లుధీర్ అనే కొత్త డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట. వామన అనే టైటిల్ తో రూపొందనున్న ఈ కమర్షియల్ మూవీలో ఊహించని అంశాలెన్నో ఉండనున్నాయట. ఆగస్ట్ నుంచి ఈ రెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేయనున్నాడట. ఈ సినిమాలు రెండూ తన కెరీర్ కు టర్నింగ్ పాయింట్స్ అవుతాయని శ్రీనివాస్ ఎంతో నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.













