సెన్సార్ పూర్తి చేసుకున్న బ్యూటీపుల్ …
రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్న నూతన చిత్రం బ్యూటీపుల్. సూరి, నైనా జంటగా, అగస్త్య మంజు దర్శకత్వంలో టైగర్ కంపెనీ ప్రొడక్షన్స్ పతాకంపై టి.అంజయ్య సమర్పణలో టి.నరేష్కుమార్, టి.శ్రీధర్ నిర్మిస్తున్నారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ ఎలాంటి కట్స్ లేకుండా సినిమాకి ఏ సర్టిఫికెట్ వచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నాం. రొమాంటిక్ ప్రేమ కథాంశంతో వైవిద్య భరితంగా మలిచిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లు సూరి, నైనా అభినయం హత్తుకుంటుంది. సన్నివేశాలతో పాటు పాటలు మదిని దోచుకుంటాయి. ఆ మధ్య విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, సింగిల్స్‌కి విశేష స్పందన లభించింది. వంగవీటి చిత్రం ద్వారా పరిచయమైన నైనా గంగూలీ ఈ చిత్రంలో రొమాంటిక్‌గా కనిపిస్తూ యువ ప్రేక్షక హృదయాలను కొల్లగొడుతుంది అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు.













