Keerthy Suresh: కీర్తి సురేష్ కు బాషా ఫ్లాష్ బ్యాక్

నేను శైలజ(Nenu Sailaja)తో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైన కీర్తి(Keerthy) ఆ తర్వాత మహానటి(Mahanati)తో నేషనల్ అవార్డు అందుకుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేసిన కీర్తి, గతేడాది బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తన ప్రియుడు ఆంటోనీ(Anthony)ని పెళ్లి చేసుకున్న కీర్తి రీసెంట్ గా జగపతి బాబు(Jayapathi Babu) హోస్ట్ చేస్తున్న టాక్ షో కు గెస్టుగా వచ్చింది.
ఆ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజవగా ఆ ప్రోమో ఆడియన్స్ ను చాలా ఎగ్జైట్ చేస్తోంది. ప్రోమో చూస్తుంటే కీర్తి గురించి చాలా విషయాలే బయటికొచ్చినట్టు అనిపిస్తోంది. చిన్నప్పుడు పాకెట్ మనీ ఇచ్చేవాళ్లా అని అడిగితే, పాకెట్ మనీ దొంగతనం చేస్తే వచ్చే సంతోషమే వేరని చెప్పిన కీర్తి, తాను సింగపూర్ లో ఏదో క్రైమ్ లో ఇరుక్కున్న విషయాన్ని జగ్గూ భాయ్ బయటపెట్టాడు.
నీకు బాషా ఫ్లాష్ బ్యాక్ ఉందట కదా.. పోలీస్ స్టేషన్ వరకు వెళ్లొచ్చావ్ అని అడిగితే చాలా సార్లు వెళ్లానని చెప్పింది కీర్తి. ఇదే ఎపిసోడ్ లో కీర్తి డిస్ట్రిక్ లెవెల్ క్రికెట్ ప్లేయర్ అనే విషయాన్ని కూడా రివీల్ చేశాడు జగపతి బాబు. క్రికెట్ ఆడుతూ సిక్స్ కొడితే ఆంటోనీ క్యాచ్ పట్టుకున్నాడా అంటే తనను క్యాచ్ పట్టుకున్నాడని కీర్తి సరదాగా చెప్పింది. ఇక నెగిటివ్ రోల్ ఆఫర్ వస్తే చేస్తావా అంటే తప్పకుండా చేస్తానని బేస్ వాయిస్ లో చెప్పింది కీర్తి. ఈ ఎపిసోడ్ ఆదివారం నుంచి అందుబాటులోకి రానుంది.