Bala krishna: బాలయ్య కూతురికి మణిరత్నం ఆఫర్
టాలీవుడ్ లో హీరోల ఫ్యామిలీల నుంచి హీరోయిన్లుగా ట్రై చేసిన వారు ఎవరూ లేరు. ఒక్క మెగా ఫ్యామిలీ నుంచి నిహారిక(niharika) మాత్రమే హీరోయిన్ గా ప్రయత్నించి ఇప్పుడు నిర్మాతగా సెటిలైంది. రజినీకాంత్(Rajinikanth) కూతుర్లు డైరెక్టర్, నిర్మాతలుగా కొనసాగుతుంటే చిరంజీవి(Chiranjeevi) పెద్ద కూతురు కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉంటూనే నిర్మాతగా మారింది.
నందమూరి బాలకృష్ణ(Balakrishna) కూతుళ్లు మాత్రం ఉన్నత విద్యావంతులుగా ఎదిగి వారి వారి వృత్తుల్లో బిజీ అయిపోయారు. బాలయ్య పెద్ద కూతురు బ్రహ్మణి హెరిటేజ్(Heritage) ఈడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆమెను హీరోయిన్ గా చేయాలని ప్రముఖ డైరెక్టర్ మణిరత్నం(Maniratnam) ట్రై చేశారనే విషయం ఇంతకాలానికి బయటికొచ్చింది.
ఆహా(Aha)లో బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ షో(Unstoppable) లో బాలయ్యనే స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేశాడు. బాబీ(Bobby), తమన్(Thaman), నాగవంశీ(Naga Vamsi) గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్లో బాలయ్య దీన్ని వెల్లడించాడు. తమన్(Thaman) అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం చెప్తూ తన కూతుళ్లిద్దరినీ ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా పెంచానని, మణిరత్నం ఒకప్పుడు బ్రహ్మణికి తన సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇవ్వగా, బ్రహ్మణికి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు వెల్లడించాడు.













