NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ?

అఖండ(Akhanda), వీరసింహా రెడ్డి(Veera Simha Reddy), భగవంత్ కేసరి(Bhagavanth Kesari), డాకు మహారాజ్ (Daku Maharaj)సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna). సక్సెస్ ఇచ్చిన జోష్ లో ఖాళీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటి సినిమాలను లైన్ లో పెట్టి కెరీర్లో ముందుకెళ్తున్న బాలయ్య(Balayya) ప్రస్తుతం అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2(Akhanda2) చేస్తున్న సంగతి తెలిసిందే.
భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అఖండ2 సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ ఆఖరి దశకు చేరుకోగా, ఈ సినిమా తర్వాత బాలయ్య, గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా, అఖండ2 షూటింగ్ పూర్తవగానే బాలయ్య ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.
గతంలో వీరిద్దరూ కలిసి వీర సింహారెడ్డి మూవీ చేయగా ఆ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కలయికలో మూవీ వస్తుందని తెలియడంతో ఈ సినిమా ఏ జానర్ లో వస్తుందని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కెరీర్లో 111(NBK111)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ ను గోపీచంద్ ఇప్పటికే రెడీ చేశారని, సెకండాఫ్ లో యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటూ ఎమోషన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని, సెకండాఫ్ లో బాలయ్య పాత్రపై ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని, ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య క్యారెక్టర్ మాఫియా నేపథ్యంలో ఉంటుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.