బాలయ్య ఫ్యాన్స్.. డోంట్ వర్రీ!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్ట్‌తో ఏపీ రాజకీయ పరిణామాలే మారిపోయాయి. ఈ నేపథ్యంలో బాలయ్య నటిస్తున్న తాజా సినిమా భగవంత్ కేసరి చెప్పిన డేటుకు వస్తుందా లేదా అని ఫ్యాన్స్ భయపడ్డారు. కానీ అనుకున్న ప్రకారమే భగవంత్ కేసరి దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రీసెంట్గా అసెంబ్లీ సమావేశాల్లో బాలయ్య చూపించిన దూకుడు భగవంత్ కేసరిపై ఏమైనా పడుతుదేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కానీ ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ ఎలాంటి దిగులు పడాల్సిన పన్లేదు. భగవంత్ కేసరిని ఏమైనా చేయాలంటే ఉన్న మార్గాలు రెండే. ఒకటి టికెట్ రేట్లు పెంచడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం, రెండు బెనిఫిట్ షోలకు నో చెప్పడం.
తెలంగాణలో ఎలాగూ ఈ సమస్య ఉండదు. ఎటొచ్చి ఏపీలో బాలయ్య సినిమాని ఇబ్బంది పెట్టాలనుకుంటే రెండు మార్గాలు తప్ప మరో ఆప్షన్ లేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే టైగర్ నాగేశ్వరరావు, లియోని నియంత్రించాలి. అసలు భగవంత్ కేసరి నిర్మాతలు ఏపీ వరకు హైక్ అడగకపోవచ్చు. మార్నింగ్ ప్రీమియర్లకు బదులు రెగ్యులర్ 5 షోలకే ఓటేయొచ్చు. సినిమాకు మంచి టాక్ వస్తే అసలివేమీ పెద్ద సమస్యలే కావు కాబట్టి ఈ విషయంలో బాలయ్య ఫ్యాన్స్ వర్రీ అవాల్సిన పన్లేదు.













