AKhanda2: అఖండ2 సెకండాఫ్ నెక్ట్స్ లెవెల్

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(Samyuktha Menon) హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా అఖండ2(akhanda2). ఆది పినిశెట్టి(Aadhi pinisetty) ఈ మూవీలో విలన్ గా నటిస్తున్నాడు. బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సూపర్ హిట్ మూవీ అఖండ(akhanda)కు సీక్వెల్ గా వస్తోన్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమాపై భారీ అంచనాలుండగా, పాన్ ఇండియా లెవెల్ లో అఖండ2 నెక్ట్స్ లెవెల్ లో వర్కవుట్ అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. అందులో భాగంగానే సినిమా గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది. అఖండ2 ఫస్టాఫ్ మొత్తం ఒకెత్తయితే, సెకండాఫ్ మరో ఎత్తు అంటున్నారు. సెకండాఫ్ నుంచి సినిమా నెక్ట్స్ లెవెల్ కు వెళ్తుందని యూనిట్ సభ్యులు ఊరిస్తున్నారు.
అఖండ2 సెకండాఫ్ లో మంచి సీన్స్ పడ్డాయని, సినిమాలో సెకండాఫ్ బాగా వచ్చిందని తెలుస్తోంది. రీసెంట్ టైమ్స్ లో పెద్ద సినిమాలకు సెకండాఫ్ ప్రాబ్లమ్ వస్తున్న నేపథ్యంలో అఖండ2 కు మాత్రం ఆ సమస్య లేదని అంటున్నారు. ఇదే నిజమైతే అఖండ2 మరిన్ని రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం. ఈసారి సినిమా కోసం మేకర్స్ నార్త్ మార్కెట్ పై ఎక్కువ ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే.