NBK111: మరోసారి డ్యూయెల్ రోల్ లో బాలయ్య?

వరుస సక్సెస్ లతో ఫుల్ జోష్ లో ఉన్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం అఖండ2(akhanda2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా వస్తున్న సినిమా కావడంతో పాటూ ఈ మూవీక మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వం వహిస్తుండటంతో అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ 5న అఖండ2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రస్తుతం అఖండ2 ను పూర్తి చేసే పనిలో ఉన్న బాలయ్య, తన తర్వాతి సినిమాను ఆల్రెడీ లైన్ లో పెట్టాడు. బాలయ్య తన నెక్ట్స్ మూవీని గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ ఈ సినిమా అనౌన్స్ అవగా, ఈ మూవీ బాలయ్య కెరీర్లో 111(NBK111)వ మూవీగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఏ జానర్ లో తెరకెక్కనుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం NBK111ను గోపీచంద్, సోషియో ఫాంటసీ జానర్ లో భారీ వీఎఫ్ఎక్స్ తో తెరకెక్కించనున్నారని, గోపీచంద్ గత సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ చేయనున్నారని, ఆ పాత్రల్ని స్పార్టకస్, అలెగ్జాండర్ క్యారెక్టర్ల నుంచి ఇన్‌స్పైర్ అయి డిజైన్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.