Balakrishna: బాలయ్య బర్త్ డే స్పెషల్స్ ఇవేనా
టాలీవుడ్ లో సెలబ్రిటీల పుట్టిన రోజు సందర్భంగా వారు చేస్తున్న, చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడమనేది కామన్. జూన్ లో రానున్న నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) బర్త్ డే కు ఫ్యాన్స్ కు రెండు కానుకలు రానున్నాయి. అందులో ఒకటి అందరూ ఎప్పటి నుంచో అనుకుటున్న అఖండ2(Akhanda2) టీజర్. బోయపాటి(Bayataki Srinu) దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ ఫినిష్ చేసుకున్న అఖండ2 టీజర్ ఎలా ఉండాలనేది బోయపాటి ప్లాన్ చేసుకున్నాడని, దాని కోసం విజువల్స్ ను తీసి పక్కన పెడుతున్నాడని తెలుస్తోంది. సినిమా పాన్ ఇండియా స్థాయిలో వస్తుండంతో అఖండ2 టీజర్ తోనే అందరినీ మెప్పించి సినిమాకు బిజినెస్ ఇంకాస్త పెంచాలని చూస్తున్నాడు బోయపాటి.
దాంతో పాటూ వీర సింహారెడ్డి(Veera Simha Reddy) లాంటి హిట్ ను బాలయ్యకు ఇచ్చిన గోపీచంద్ మలినేని(Gopichand Malineni)తో చేయబోయే సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా జూన్ 10న రానున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా జాట్(Jaat) తో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సన్నీ డియోల్(Sunny Deol) కు హిట్ ఇచ్చిన గోపీచంద్ ఇప్పుడు బాలయ్య(Balayya)తో మరోసారి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాను వృద్ధి సినిమాస్(Vriddhi Cinemas) బ్యానర్ లో సతీష్ కిలారు(Satish Kilaru) భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఇప్పటికైతే బాలయ్య బర్త్ డే కు వచ్చే కానుకలివే. ఇంకేమైనా తోడవుతాయేమో చూడాలి.













