Padma Awards 2025: పద్మ భూషణ్ అవార్డు అందుకొన్న బాలకృష్ణ, అజిత్..
కళలు, పారిశ్రామిక రంగాలకు, అలాగే సామాజిక సేవ, ఇతర రంగాల్లో విశేష ప్రతిభ, సేవలు అందించిన ప్రముఖులకు ఇచ్చే పద్మ అవార్డుల (Padma Awards) కార్యక్రమం ఢిల్లీలో కన్నుల పండువగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన, ఆమె చేతుల మీదుగా పద్మ విజేతలకు పురస్కరాలను అందజేశారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ అవార్డుల ప్రధాన కార్యక్రమానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారతీయ సినిమాకు సంబంధించిన నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్కు ఈ అవార్డులను అందజేశారు. వీరిద్దరికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి భవన్లో వైభవంగా జరిగిన వేడుకలో పలు రంగాలకు చెందిన ప్రముఖులు అవార్డులను అందుకొన్నారు.

తెలుగు సినిమా పరిశ్రమ నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలుగుదనం ఉట్టిపడేలా పంచ, లాల్చి ధరించి.. మెడలో కండువా ధరించి అందర్నీ ఆకట్టుకొన్నాడు. ఈ వేడుకకు హాజరైన అతిథులకు అభివాదం చేశారు. రాష్ట్రపతి ముర్ము వద్దకు వినమ్రంగా వెళ్లి అవార్డును అందుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపారు.