దేవరలో ఓ రేంజ్ ఎలివేషన్లు
ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని జూ. ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి దేవర అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ సినిమా మొదటి భాగం అక్టోబర్ 10న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. చెప్పుకోడానికే టైమ్ చాలా ఉందనిపిస్తుంది కానీ దేవర లాంటి పాన్ ఇండియా సినిమాలకు ఏడు నెలలు చాలా తక్కువ టైమే.
వాస్తవానికి దేవర ఏప్రిల్ 5న రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా అక్టోబర్ కు వాయిదా పడింది. త్వరలోనే చిత్ర యూనిట్ కొత్త షెడ్యూల్ కోసం గోవా వెళ్లనుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వినిపిస్తోంది. దేవర సినిమాను తండ్రి కొడుకుల కథగా తారక్ ను రెండు విభిన్న పాత్రల్లో కొరటాల చూపించనున్నాడని ఇన్ సైడ్ టాక్.
మొదటి భాగంలో కొడుకు కు సంబంధించిన అంశాలను ఆవిష్కరించి, సీక్వెల్ లో తండ్రి క్యారెక్టర్ ను హై ఓల్టేజ్ లో రివీల్ చేస్తారని తెలుస్తోంది. అలా అని తండ్రి పాత్రలో ఎన్టీఆర్ వయసు మళ్లిన వాడిగా కనిపించడట. బాహుబలి సినిమాలోలానే రెండు కాలాల్లో రెండు పాత్రలను చూపించి, ఒకదానితో ఒకటి సింక్ చేసే విధానం దేవరలో చాలా స్పెషల్ గా ఉంటుందట. చూస్తుంటే దేవరలో జూనియర్ ఎన్టీఆర్ కు ఓ రేంజ్ ఎలివేషన్స్ ఉంటాయని అర్థమవుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారానే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం కానుంది.













