B Saroja Devi: అందాల సీనియర్ నటి, పద్మభూషణ్ బి సరోజ దేవి ఇక లేరు

బెంగళూరులోని తన నివాసంలో (Saroja Devi)(87) తుదిశ్వాస విడిచారు. తెలుగు, కన్నడ, తమిళ సినిమాల్లో సరోజాదేవి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎంజీఆర్ వంటి దిగ్గజ నటులతో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. 1942 లో కర్ణాటకలో జన్మించిన సరోజాదేవి 13 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 200కు పైగా సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలతో అభిమానులను సొంతం చేసుకొన్నారు.
1955 నుంచి 1984 మధ్య 29 ఏళ్ల పాటు వరుసగా 161 సినిమాల్లో లీడ్ల్లో నటించిన ఏకైక నటిగా సరోజాదేవి చరిత్ర సృష్టించారు. సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గాను ప్రభుత్వం ఆమెను 1969లో పద్మశ్రీతో, 1992లో పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించింది.