WAR2: వార్2 లేటెస్ట్ అప్డేట్
కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో దేవర(Devara) సినిమా చేసి ఆ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ ను అందుకున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR), ఆ తర్వాతి సినిమాగా వార్2(War2) చేసిన సంగతి తెలిసిందే. వార్2 కోసం కూడా ఎన్టీఆర్ ఎక్కువ రోజులే కేటాయించాడు. అయాన్ ముఖర్జీ(Ayaan Mukherjee) దర్శకత్వంలో బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్(Hrithik Roshan) తో కలిసి ఎన్టీఆర్ ఆ సినిమా చేస్తున్నాడు.
ఎన్టీఆర్ హిందీలో చేస్తున్న మొదటి సినిమా కావడం, ఆ సినిమాలో హృతిక్ రోషన్ కూడా కలిసి నటించనుండటంతో వార్2(War2) పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలోనే వార్2 కు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా అది వెంటనే నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే వార్2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను శరవేగంగా జరుపుకుంటుంది.
అయితే ఇప్పుడు వార్2 గురించి ఓ వార్త వినిపిస్తోంది. వార్2 కోసం ఎన్టీఆర్ వచ్చే వారం నుంచి డబ్బింగ్ చెప్పబోతున్నాడని, తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోనూ స్వయంగా ఎన్టీఆరే డబ్బింగ్ చెప్తున్నాడని అంటున్నారు. ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్రను కూడా అయాన్ ముఖర్జీ డిజైన్ చేశాడని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prasanth Neel) తో కలిసి డ్రాగన్(Dragon) సినిమా చేస్తున్న తారక్(Tarak), నెక్ట్స్ వీక్ వార్2 కోసం ముంబై వెళ్లనున్నాడన్న మాట.






