AA26XA6: అట్లీ మూవీ అనుకున్న దానికంటే ముందుగానే?
అల్లు అర్జున్(allu arjun) హీరోగా అట్లీ కుమార్(atlee kumar) దర్శకత్వంలో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్(sun pictures) రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలుండటంతో ఈ ప్రాజెక్టు గురించి ఏ చిన్న వార్త వినిపించినా అది వెంటనే వైరల్ అవుతుంది. పైగా పుష్ప2(pushpa2) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత బన్నీ(Bunny) నుంచి వస్తున్న సినిమా కావడంతో అందరూ దీని కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయని, వాటి కోసం చాలా ఎక్కువ టైమ్ పడుతుందని మేకర్స్ సినిమా మొదలుపెట్టే సమయంలోనే చెప్పగా, ఇప్పుడు ఈ మూవీ అనుకున్న దాని కంటే చాలా త్వరగా పూర్తవుతుందని, సినిమా మేకింగ్ విషయంలో అట్లీ చాలా క్లారిటీగా ఉండటంతో షూటింగ్ ఫాస్ట్ గా అయిపోతుందని తెలుస్తోంది.
తాజా సమాచారం ఈ సినిమా షూటింగ్ ను 2026 మే నాటికి పూర్తి చేసి, వచ్చే ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు దీన్ని 2027లో రిలీజ్ చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు షూటింగ్ త్వరగా పూర్తవుతుండటంతో దసరాకే రిలీజ్ చేయాలని చూస్తున్నారట.






