Atlee: కాపీ వార్తలపై నోరు విప్పిన అట్లీ

కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ(Atlee) కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు. అపజయం ఎరుగని తమిళ డైరెక్టర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అట్లీ. రాజా రాణి(Raja Rani)తో కెరీర్ ను మొదలుపెట్టిన అట్లీ ఆ తర్వాత తేరి(Theri), మెర్సల్(Mersal), బిగిల్(bigil), జవాన్(jawaan) తో ఒకదాన్ని మించి మరొకటి హిట్లు అందుకున్నాడు. జవాన్ తర్వాత అల్లు అర్జున్(allu arjun) తో సినిమాను అనౌన్స్ చేసి మరోసారి వార్తల్లో నిలిచాడు అట్లీ.
కళా రంగానికి అట్లీ చేసిన సేవలను గుర్తించిన సత్యభామ యూనివర్సిటీ(Satyabhama University) అతనికి డాక్టరేటును ప్రదానం చేసింది. 35వ కాన్వకేషన్ లో అట్లీకి ఆ డాక్టరేటును ఇచ్చి అతన్ని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా అట్లీ మాట్లాడుతూ తాను రెగ్యులర్ గా ఫేస్ చేస్తున్న ఓ పెద్ద ఆరోపణపై నోరు విప్పాడు. తాను తీసే సినిమాలను కాపీ అంటుంటారని, కానీ అవన్నీ తాను రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయి తీసినవే అని అట్లీ వెల్లడించాడు.
ఎగ్జాంపుల్ గా బిగిల్ లోని రాయప్పన్(Rayappan) క్యారెక్టర్ గురించి అట్లీ చెప్పాడు. జేపీఆర్ సర్(JPR Sir) నుంచి స్పూర్తి పొందే ఆ క్యారెక్టర్ ను రాసుకున్నానని, చదువులకు, క్రీడలకు ఆయనెంతో సాయం చేసేవారని అట్లీ తెలిపాడు. ఆయన వల్లే తాను ఇంత త్వరగా డైరెక్టర్ ను అయ్యానని చెప్పిన అట్లీ, తాను డైరెక్టర్ అయ్యే వరకు మొత్తం తన అమ్మ, నాన్నే చూసుకున్నారని, తాను మంచి మనిషిగా ఉండటానికి రీజన్ తన భార్య, కొడుకేనని అన్నాడు. తన తర్వాతి సినిమా అల్లు అర్జున్ తో ఉంటుందని, ఆ సినిమా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, డాక్టరేట్ తో తనను సత్కరించిన అందరితో పాటూ ఇండియా గర్వపడేలా తాను వర్క్ చేస్తానని అట్లీ ఈ సందర్భంగా ప్రామిస్ చేశాడు.