Atlee: అట్లీ ఫోకస్ మొత్తం ఆ యాడ్ పైనే

అల్లు అర్జున్(Allu Arjun)- అట్లీ(Atlee) కాంబినేషన్ లో వస్తున్న సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. జవాన్(jawaa) సినిమా తర్వాత అట్లీ నుంచి వస్తున్న మూవీ కావడం, పుష్ప2(Pushpa2) తర్వాత బన్నీ(Bunny) చేస్తున్న సినిమా కావడంతో అందరికీ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. అందుకే ఈ సినిమా గురించి ఏ చిన్న విషయం బయటికొచ్చినా అది నెట్టింట తెగ వైరల్ అయిపోతుంది.
ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ వస్తుందేమోనని ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్న టైమ్ లో అట్లీ తన ఫోకస్ ను ఓ కమర్షియల్ యాడ్ పై పెట్టాడు. చింగ్స్ సీక్రెట్(Ching’s Secret) అనే బ్రాండ్ కోసం రణ్‌వీర్ సింగ్ తో కలిసి అట్లీ ఓ యాడ్ ను షూట్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) చింగ్స్ సీక్రెట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు.
గతంలో చింగ్స్ సీక్రెట్ యాడ్ ను రోహిత్ శెట్టి(Rohit Shetty), అలీ అబ్బాస్ జాఫర్(Ali Abbas Jaffer) లాంటి వారు తెరకెక్కించగా, ఇప్పుడు ఆ బాధ్యతల్ని అట్లీ తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అట్లీ ఆ యాడ్ పైనే ఫోకస్ చేశాడని, దాని కోసం ఓ మంచి యాక్షన్ కామెడీ యాడ్ ను రూపొందించాలని చూస్తున్నట్టు సమాచారం. ఈ యాడ్ లో రణ్‌వీర్ సింగ్ తో పాటూ బాబీ డియోల్(Bobby deol), రాజ్‌పాల్ యాదవ్(Rajpal Yadav), శ్రీలీల(Sree Leela) కూడా నటిస్తుండగా, ఆల్రెడీ ఇప్పటికే మెహబూబ్ స్టూడియోస్(Mehboob Studios) లో ఈ యాడ్ షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. ఈ యాడ్ ను గతంలో కంటే భారీ స్థాయిలో రూపొందిస్తుండగా, ఈ వీకెండ్ కు యాడ్ షూటింగ్ పూర్తయ్యే అవకాశాలున్నాయి.