Arjun: విశ్వక్ సినిమాతో అర్జున్ పోటీ
మూడేళ్ల కిందట తమిళ నటుడు అర్జున్(Arjun) దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ నటుడు విశ్వక్ సేన్(Viswaksen) హీరోగా ఓ సినిమాను అనుకుని, అంతా అయిపోయిందనుకునే టైమ్ లో విశ్వక్ ఆ సినిమా నుంచి బయటకు రావడంతో అర్జున్ హైదరాబాద్ కు వచ్చి మరీ విశ్వక్ పై విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విశ్వక్ తన కారణాలు తాను చెప్పి క్లారిటీ కూడా ఇచ్చాడు.
తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత అర్జున్ సైలెంట్ గా ఉండేసరికి ఈ ప్రాజెక్టు ను ఆయన పక్కన పెట్టారనుకున్నారు. కానీ అర్జున్ ఆ సినిమాను ముందుకు తీసుకెళ్లి ఇప్పుడు రిలీజ్ కు రెడీ చేశారు. అదే సీతాపయనం(Sitapayanam). నిరంజన్ సుధి(Niranjan Sudhi) అనే కన్నడ హీరో మరియు ఐశ్వర్య అర్జున్(Aiswarya Arjun) జంటగా ఈ సినిమాను తెరకెక్కించాడు అర్జున్.
ఇదంతా బానే ఉంది కానీ ఇప్పుడీ సినిమాను ఫిబ్రవరి 14న వేలంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేస్తుండటం విశేషంగా మారింది. దానికి కారణం లేకపోలేదు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన ఫంకీ(Funky) సినిమా ఫిబ్రవరి 13న రిలీజవుతుంది. సరిగ్గా దానికి ఒక రోజు తర్వాత అర్జున్ తన సినిమాను రిలీజ్ చేయడం కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. విశ్వక్ తో పోటీ పడాలనే అర్జున్ ఇలా ప్లాన్ చేశాడా లేదా అనేది చూడాలి. మరి ఈ విషయంపై అర్జున్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.













