ఈసారి మహేష్‌తో చేసే సినిమా మామూలుగా ఉండదంటున్న మురుగదాస్?
డైరెక్టర్ అంటే హీరోలందరూ రెస్పెక్ట్ ఇస్తారు. కానీ, డైరెక్టర్ అంటే గుడ్డిగా వెళ్లిపోయే హీరోలు కొంతమంది ఉంటారు. వారిలో మహేష్ ఒకడు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అన్నట్టుగా… ఒక డైరెక్టర్‌తో సినిమా చెయ్యాలని డిసైడ్ అయిన తర్వాత డైరెక్టర్ చెప్పినట్టు వింటాడు తప్ప తన మాట తను కూడా వినడు. అంటే డైరెక్టర్‌కి పూర్తి స్వేచ్ఛ ఇస్తాడు. అతను ఏం చెప్పినా చెయ్యడానికి వెనుకాడడు. ఇది కొన్నిసార్లు మహేష్‌కి విజయాలు అందించింది. కొన్నిసార్లు పరాజయాలు చవి చూపించింది. మురుగదాస్ కాంబినేషన్లో మహేష్ చేసిన స్పైడర్ ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలై ఘోర పరాజయాన్ని పొందింది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే గతంలో మురుగదాస్ చేసిన సినిమాలన్నీ మంచి మెసేజ్ ఉంటూనే కమర్షియల్ ఫార్ములాతో ఉంటాయి. కానీ, స్పైడర్ విషయంలో మాత్రం అతని అంచనా తారుమారైంది. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా అనగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుందని అభిమానులు ఆశించారు. కానీ, ఈ సినిమా ఫలితం అందర్నీ నిరాశపరిచింది.
ఇప్పుడు మహేష్ కోసం మురుగదాస్ ఓ విభిన్నమైన సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడట. ఈసారి మహేష్ కోసం రెడీ చేస్తున్న సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటుందని, ప్రేక్షకుల్ని, అభిమానుల్ని నిరాశ పరచదని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు మురుగదాస్. ఇటీవల రజనీకాంత్‌తో మురుగదాస్ చేసిన దర్బార్ కూడా కమర్షియల్‌గా సక్సెస్ అవ్వలేదు. అయితే మహేష్‌తో చేయబోయే సినిమా విషయంలో మాత్రం అలా జరగదని, తప్పకుండా మహేష్ కెరీర్లో ది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అంటున్నాడు. ప్రస్తుతం మహేష్ `సర్కారువారి పాట` సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత రాజమౌళి కాంబినేషన్లో సినిమా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా షూటింగులు నిలిచిపోయాయి. పరిస్థితులు చక్కబడిన తర్వాత సర్కారువారి పాట చిత్రాన్ని పూర్తి చేస్తారు. మరోపక్క రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే మహేష్‌తో సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో మహేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాల్సి ఉంది.













