నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది
బాహుబలి, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి వంటి విజయవంతమైన చిత్రాలతో టాలీవుడ్లో అగ్ర నాయికగా నిలిచిన బ్యూటీ అనుష్క. ఈ చిత్రాలు ఆమె కెరీర్లో మరచిపోలేని సినిమాలుగా నిలిచిపోయాయి. ఈ భామ ప్రస్తుతం ఓ కమర్షియల్ సినిమాలు చేయడానికి సిద్ధమైంది. దశాబ్దపు కెరీర్లో ఎన్నో విషయాల్ని నేర్చుకున్నా, నాగార్జున వల్లనే నాలో పరిణతి వచ్చింది. ఆయన వల్లనే పరిశ్రమలో అడుగుపెట్టాను. ఇప్పుడు కథానాయికగా ఎంతో ఎదిగాను అని వినమ్రంగా చెప్పింది అనుష్క. మూడు పదుల వయసు దాటిన ఈ భామ తన పెళ్లి గురించి మాట్లాడుతూ నా ఈడు అమ్మాయిలందరి పెళ్లిళ్లు అయిపోతున్నాయి. నా స్నేహితురాళ్లంతా పెళ్లి చేసుకొని సెటిలైపోయారు. నేను మాత్రం ఒంటరిగానే ఉండిపోయాను. అయితే ఇలాగే ఉండాలనుకోవడం లేదు. నాకు కూడా పెళ్లి చేసుకోవాలనుంది. పిల్లా పాపల్ని కని భర్తతో కాపురం చేయాలనుంది అని ఈ బ్యూటీ చెప్పింది. తాను ఇంత అందంగా ఉండటానికి యోగాయే కారణమని ఆమె పేర్కొంది. మరి అనుష్క పెళ్లి ఎప్పుడు అవుతుందా అనేది వేచి చూడాల్సిందే.













