Anushka: స్వీటీ నో చెప్పడానికి రీజనేంటి?
టాలీవుడ్ లోని సీనియర్ హీరోలకు హీరోయిన్ లను ఎంపిక చేయడం చాలా పెద్ద సమస్యగా మారింది. సీనియర్ హీరోలందరూ 60 ఏళ్లు దాటిన వాళ్లే అవడంతో ఆ వయసుకు తగ్గ హీరోయిన్లను తీసుకురావడం ఇబ్బంది అయిపోయింది. అందుకే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అయిపోయి షూటింగ్ కు వెళ్లడమే లేటనుకున్న పలు సినిమాలు కూడా ఆలస్యమవుతున్నాయి.
హీరోయిన్లు దొరక్క రిపీటెడ్ భామలను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే త్రిష(trisha), నయనతార(nayanthara) తప్ప మరే కొత్త ఆప్షన్లు కనిపించడం లేదు. రీసెంట్ గా బాలయ్య(balayya) హీరోగా గోపీచంద్ మలినేని(gopichand malineni) దర్శకత్వంలో రాబోతున్న సినిమా కోసం కూడా మేకర్స్ నయనతారను ఫిక్స్ చేశారు. అయితే ఈ ప్రాజెక్టు నయనతార కంటే ముందు అనుష్క(Anushka) వద్దకు వెళ్లిందట.
కానీ స్వీటీ ప్రస్తుతం తానే సినిమానూ చేసే పరిస్థితుల్లో లేనని సున్నితంగానే ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది. బరువు ఎక్కువయ్యాననే కారణంతో గత కొన్నాళ్లుగా బయటకు కనిపించని స్వీటీ అందుకే ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసిందా లేక మరేమైనా కారణాలున్నాయా అనేది తెలియాల్సి ఉండగా, ఒకవేళ సీనియర్ హీరోల సరసన నటించడానికి స్వీటీ ఒప్పుకుంటే మాత్రం అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చి మళ్లీ బిజీగా మారడం ఖాయం.






