అనుదీప్ – రవితేజల ఎంటర్టైనర్
జాతి రత్నాలు సినిమా మంచి హిట్ అవడంతో ఆ సినిమా డైరెక్టర్ అనుదీప్ కు చాలా బ్యానర్ల నుంచి ఆఫర్లొచ్చాయి. చాలా మంది హీరోలు కూడా అనుదీప్ తో సినిమాలు చేయాలని డిస్కషన్స్ చేశారు. కానీ అనుదీప్ మాత్రం ఎవరూ ఊహించని రీతిలో తమిళ హీరో శివ కార్తికేయన్ తో ప్రిన్స్ సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది.
దీంతో అనుదీప్ తన తర్వాతి సినిమా విషయంలో చాలా టైమ్ తీసుకున్నాడు. మామూలుగా అయితే ఇప్పటికే అనుదీప్ సితార బ్యానర్ లో మరో సినిమాను చేయాల్సి ఉంది. కానీ ప్రిన్స్ మూవీ ఇచ్చిన షాక్ కు అనుదీప్ స్క్రిప్ట్ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొన్నా మధ్య నవీన్ పోలిశెట్టితోనే అనుదీప్ సెట్స్ కి వెళ్లనున్నాడన్నారు కానీ దానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది.
దీంతో అనుదీప్ మాస్ మహారాజా రవితేజతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో సినిమా ఉంటుందని గతేడాది నుంచే వార్తలొస్తున్నాయి. వాస్తవానికి ఇప్పటికే అనుదీప్ రవితేజకు మూడు కథలు చెప్పగా, అవేవీ రవితేజకు పెద్దగా నచ్చకపోవడంతో అనుదీప్ రీసెంట్గా ఎంటర్టైనర్ అనే టైటిల్‌తో ఓ క్రేజీ స్టోరీని చెప్పగా, ఆ కథకు రవితేజ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.













