అనుదీప్ చేసే ప్రయత్నం ఫలిస్తుందా?
పిట్టగోడ అనే సినిమాతో టాలీవుడ్ కు డైరెక్టర్ గా పరిచయమైన అనుదీప్ కేవీ ఆ తర్వాత తీసిన జాతిరత్నాలు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి కామెడీని తెలుగు తెరపై అప్పటివరకు చూసింది లేదు. హీరో పాత్రలను చాలా సిల్లీగా చూపిస్తూనే భలే నవ్వించగలిగాడు. ఆ సినిమా తర్వాత అనుదీప్ మీద అంచనాలు ఓ రేంజ్ లో పెరిగాయి.
జాతిరత్నాలు చూసిన తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్ పిలిచి మరీ ప్రిన్స్ ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిలైంది. ప్రిన్స్ రిలీజై రెండేళ్లు కావొస్తున్నా అనుదీప్ ఇప్పటివరకు తన తర్వాతి సినిమాను మొదలుపెట్టింది లేదు. అనుదీప్ నెక్ట్స్ మూవీ రవితేజతో అని కాసేపు, వేరే హీరోతో అని మరికాసేపు ప్రచారాలు జరిగాయి కానీ అవేమీ నిజం కాలేదు.
ఇప్పుడు మొత్తానికి అనుదీప్ కొత్త సినిమా ఫిక్స్ అయింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో విశ్వక్సేన్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. విశ్వక్ కు ఇది 14వ సినిమా. వీరిద్దరి కలయికలో సినిమా అంటే క్రేజీ కాంబో అవుతుందనంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రెండేళ్ల తర్వాత అనుదీప్ చేస్తున్న ఈ ప్రయత్నం అతనికెలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













