ఇస్మార్ట్ హీరోతో అనుదీప్ సినిమా..?
డైరక్టర్ అనుదీప్ కేవీ అంటే టాలీవుడ్ కి ఇదివరకు పరిచయం లేదేమో కానీ ఇప్పుడు జాతిరత్నాలు సినిమాతో అందరికీ పరిచయమైపోయాడు. వాస్తవానికి అనుదీప్ డెబ్యూ సినిమా పిట్టగోడ కానీ ఈ సినిమా అసలెప్పుడు రిలీజ్ అయిందో కూడా చాలా మందికి తెలీదు. సెకండ్ సినిమాగా రిలీజ్ అయిన జాతి రత్నాలు అనుదీప్ రేంజ్ నే పెంచేసింది.
జాతి రత్నాలు చేసిన మ్యాజిక్ అలాంటిది. నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శిలతో తెరకెక్కించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచి పాజిటివ్ టాక్ తో సూపర్ హిట్ అయింది. పెట్టిన పెట్టుబడికి మూడింతలు లాభాలు తెచ్చిన పెట్టిన ఈ సినిమాను నాగ్ అశ్విన్ నిర్మించగా, ఫరియా అబ్దుల్లా అనే హీరోయిన్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టింది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇండస్ట్రీ కన్నంతా అనుదీప్ తర్వాతి సినిమా గురించే. ఎవరితో ఏ సినిమా చేయనున్నారని అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అయితే అనుదీప్ తర్వాత సినిమా మాత్రం మంచి మాస్ సినిమా అని తెలుస్తుంది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం, అనుదీప్ యంగ్ హీరో రామ్ పోతినేని ని కలిసి ఒక స్టోరీ లైన్ వినిపించాడని, రామ్ కూడా అది విని సానుకూలంగా స్పందించి, ఫుల్ నెరేషన్ అడిగినట్లు వార్తలొస్తున్నాయి. స్రవంతి మూవీస్ తో పాటూ, వైజయంతి మూవీస్ కలిసి నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ తమిళ్ డైరక్టర్ లింగు స్వామి డైరక్షన్ లో ఒక మాస్ సినిమా చేస్తున్నాడు. మరి అనుదీప్ సినిమా విషయంలో ఇంకా క్లారిటీ రావాలి.













