Akhanda2: అఖండ2 నుంచి మరో టీజర్ రాబోతుందా?

నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా తెరకెక్కుతున్న సినిమా అఖండ2(akhanda2). బ్లాక్ బస్టర్ సినిమా అఖండ(akhanda)కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తోడు ఈ సినిమాకు బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ డివోషనల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గానే ఓ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే అఖండ2 గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తోంది. అఖండ2 నుంచి మేకర్స్ మరో బిగ్ ట్రీట్ ను రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఆల్రెడీ ఓ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు ఫ్యాన్స్ కోసం మరో టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారని రూమర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.
అఖండ2 రిలీజ్ గురించి రీసెంట్ గా రూమర్లు తెగ వినిపిస్తున్న నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకే మేకర్స్ మరో టీజర్ ను రెడీ చేస్తున్నారని అంటున్నారు. అయితే ఈ రెండో టీజర్ పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) జంటగా నటిస్తున్న ఈ సినిమాను 14 రీల్స్(14 Reels) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, తమన్(Thaman) అఖండ2కు సంగీతం అందిస్తున్నారు.