తారక్ తో మరోసారి జక్కన్న మూవీ?
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(jr. ntr), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(ss rajamouli) కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. RRRతో ఈ ఇద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు(mahesh babu)తో వారణాసి(varanasi) సినిమాను తెరకెక్కిస్తుండగా, ఎన్టీఆర్ మరోవైపు డ్రాగన్ తో బిజీగా ఉన్నారు. వారణాసి రిలీజ్ కు ఏప్రిల్ 7, 2027 డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.
ఇదిలా ఉంటే రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో అప్పుడే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ మొదలైంది. బాహుబలి3(bahubali3), RRR2 వంటి పేర్లు ఎప్పటినుంచో వినిపిస్తున్నప్పటికీ, ఇప్పుడు మరో కొత్త రూమర్ తెరపైకి వచ్చింది. RRR2లో ఎన్టీఆర్‌తో మళ్లీ మల్టీస్టారర్ చేయడం కంటే, ఆయనను సోలో హీరోగా పెట్టి ఓ భారీ కథను తెరకెక్కించే ఆలోచన రాజమౌళికి ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు.
ఇవి కూడా చదవండి
ఇటీవల ఓ ఈవెంట్ లో రాజమౌళి, ఎన్టీఆర్ కలిసి కనిపించడం, వారణాసి గురించి తారక్ సరదాగా చేసిన కామెంట్స్ కూడా ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచాయి. అంతేకాదు, నటుడిని కేవలం స్టార్ ఇమేజ్ ఆధారంగా కాకుండా కథకు సరిపోయే పాత్రను బట్టి ఎంపిక చేస్తానని రాజమౌళి తాజాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తారక్‌తో మరోసారి జక్కన్న సినిమా అనే ప్రచారం ఎంతవరకు నిజమవుతుందో తెలియాలంటే అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.








