Anjali: ఊహించని రెస్పాన్స్ అందుకున్న అంజలి సినిమా
ఓ హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి రిలీజవడంలో ఆశ్చర్యమేమీ లేదు కానీ వాటి ఫలితాలు రివర్స్ లో ఉండటమే అనూహ్యం. టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali)కి ఇప్పుడలాంటి పరిస్థితే ఎదురైంది. రిలీజ్ ముందు వరకు గేమ్ ఛేంజర్(Game Changer) పై ఆమె పెట్టుకున్న ఆశలు అన్నీ ఇన్నీ కావు. కెరీర్లోనే బెస్ట్ సినిమా అవుతుందనుకుంటే రామ్ చరణ్ తో నటించాననే సంతృప్తి తప్ప అంజలికి ఏమీ మిగల్చలేదు.
మరోవైపు అంజలి ఎప్పుడో 12 ఏళ్ల కిందట నటించిన తమిళ మూవీ మద గజ రాజా(Madha gaja raja) చాలా లేట్ గా మొన్న పొంగల్ కు రిలీజై ఎవరూ ఊహించని రీతిలో బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పటికే ఆ సినిమా రూ.40 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసి కోలీవుడ్ లో గేమ్ ఛేంజర్ ను వెనుకడుగేసేలా చేస్తోంది. అంజలి ఈ సినిమాను ఫస్ట్ లైట్ తీసుకుంది.
కానీ ఇప్పుడా సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూసి రీసెంట్ గా సక్సెస్ మీట్ కు వెళ్లి తన ఆనందాన్ని పంచుకుంది. ఆ సినిమా తెలుగు డబ్బింగ్ ఇంకా రాలేదు. నిర్మాతలు ప్రస్తుతం ఆ ఏర్పాట్లలో ఉన్నట్లు తెలుస్తోంది. మంచి టైమ్ చూసి తెలుగులో కూడా రిలీజ్ చేస్తే ఇక్కడ కూడా అదే రెస్పాన్స్ వస్తుందని నిర్మాతలు భావిస్తున్నారు.













