Balayya: బాలయ్య సినిమాకు అనిరుధ్ సంగీతం?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని(Gopichand Malineni) కాంబినేషన్ లో వచ్చిన వీర సింహారెడ్డి(Veera Simha reddy) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ సినిమా రిలీజ్ టైమ్ లోనే వారిద్దరూ కలిసి మరో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఇద్దరి కమిట్మెంట్స్ వల్ల అది కుదరలేదు. ప్రస్తుతం బాలయ్య(Balayya) అఖండ2(Akhanda2) లో బిజీగా ఉంటే, గోపీచంద్ సన్నీ డియోల్(Sunne Deol) తో జాత్(Jaat) సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబోకి లైన్ క్లియర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆ సినిమాకు సౌత్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్(Anirudh) సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. దేవర(Devara)కు మంచి సాంగ్స్, బీజీఎం చూశాక ప్రతీ హీరో అభిమానులు తమ హీరో కూడా అనిరుధ్ తో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జైలర్(Jailer) సినిమా తర్వాత అనిరుధ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.
ఆ సినిమాలో రజినీ(Rajnikanth) పాత్రను అనిరుధ్ ఎలివేట్ చేసిన విధానం అందరినీ మెప్పించింది. అలాంటిది మాస్ హీరో అయిన బాలయ్యకు అనిరుధ్ సంగీతం ఇస్తే అది ఏ రేంజ్ లో ఉంటుందో ఆలోచిస్తేనే గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ సినిమాను అగ్ర నిర్మాణం సంస్థ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో రూపొందించే దిశగా ప్రణాళికలు జరుగుతున్నాయి.













