అనిరుధ్ ఛాలెంజింగ్‌గా తీసుకుంటాడా?
సౌత్ ఇండియా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం కెరీర్ లో మంచి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. రీసెంట్గా జైలర్ సినిమాకు అనిరుధ్ ఇచ్చిన బీజీఎం, కావాలయ్యా సాంగ్ ఆడియన్స్ లోకి ఏ రేంజ్ లో వెళ్లాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనిరుధ్ ఇష్టపడి సినిమాను చేస్తే ఏ రేంజ్ అవుట్‌పుట్ ఉంటుందో జైలర్ సినిమాతో మరోసారి నిరూపించాడు.
కానీ రీసెంట్గా వచ్చిన జవాన్ కు మాత్రం అనిరుధ్ ఆ స్థాయి మ్యూజిక్ ఇవ్వలేదనేది వాస్తవం. అట్లీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నా, ఈ సినిమా మ్యూజిక్ విషయంలో ఆడియన్స్ యునానిమస్ రిపోర్ట్స్ ఇవ్వట్లేదు. జిందా జిందా అనే సాంగ్ స్క్రీన్ పై బాగుంది కానీ మిగిలిన సాంగ్స్ మాత్రం రిపీట్ వాల్యూ లేవు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు కొరటాల శివ దేవర కోసం ఎలాంటి ట్యూన్స్ ను తన నుంచి రాబట్టుకుంటాడా అనేది అందరికీ ఆసక్తిగా మారింది. చెన్నైలో ఉండే అనిరుధ్ మాటిమాటికీ ఇక్కడకు రాలేడు. వచ్చినప్పుడే అన్నీ సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి సరైన మ్యూజిక్ ను రాబట్టుకోవాల్సి ఉంటుంది. అనిరుధ్ ఇంతకు ముందు తెలుగులో అజ్ఞాతవాసి, గ్యాంగ్ లీడర్, జెర్సీ లాంటి సినిమాలు చేసినా వాటికేమీ గొప్ప పేరు రాలేదు. కాబట్టి దేవర సినిమాతో తన సత్తాను తెలుగులో చాటాలని అనిరుధ్ ఛాలెంజింగ్ గా తీసుకుంటే మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.













