తెలుగు సినిమాను లైట్ తీసుకుంటున్న అనిరుధ్?
తమిళంలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ కెరీర్ స్టార్టింగ్ నుంచే టాప్ గేర్ లో నడుస్తోంది. తమిళ టాప్ స్టార్లందరితో అనిరుధ్ సినిమాలు చేశాడు. వేదాలం, కత్తి, మాస్టర్, విక్రమ్, జైలర్ సినిమాలకు అతను అందించిన సాంగ్స్, బీజీఎం గురించి ఎంత చెప్పినా తక్కువ. అందరూ చూస్తుండగానే అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్లందరినీ పక్కకు నెట్టి మరీ టాప్ లో నిలిచాడు.
అనిరుధ్ కు తమిళంతో పాటూ తెలుగులో కూడా మంచి క్రేజే ఉంది. కానీ తెలుగులో అనిరుధ్ తన స్థాయికి తగ్గ మ్యూజిక్ ఇవ్వలేదనే ముద్ర వేసుకున్నాడు. మొదటి సినిమా అజ్ఞాతవాసితో నిరాశ పరిచిన అనిరుధ్, ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలతో ఫర్వాలేదనిపించుకున్నాడు. టాలీవుడ్ మాస్ ఆడియన్స్ ను అనిరుధ్ ఇంప్రెస్ చేయలేకపోయాడు.
దేవర సినిమాతో ఆ లోటు తీరుస్తాడని అందరూ అనుకున్నారు. కానీ దేవర నుంచి సాంగ్స్ ఒక్కొక్కటిగా రిలీజవుతుంటే అనిరుధ్ మీద నెగిటివిటీ కూడా అంతే పెరుగుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన సాంగ్స్ కాపీ సాంగ్స్ అనే ముద్ర వేసుకున్నాయి. తమిళంలో తన పాటలకు కొత్తదనం చూపించే అనిరుధ్, తెలుగు సినిమాల విషయానికొచ్చేసరికి ఇలా ఎందుకు చేస్తున్నాడని కొందరంటుంటే, తెలుగు సినిమాలపై అనిరుధ్ కు ఎందుకింత చిన్నచూపని కొందరంటున్నారు.













