అనిరుధ్ తో అలా ఉంటే బెస్ట్
సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ కు స్పెషల్ స్టేటస్ ఉంది. వరుస బ్లాక్ బస్టర్లతో తన డిమాండ్‌ను పెంచుకుంటూ పోయిన అనిరుధ్.. కమల్ హాసన్, రజినీకాంత్, షారుఖ్ ఖాన్ లాంటి సీనియర్ మోస్ట్ హీరోలకు ఇండస్ట్రీ హిట్స్ దక్కేలా చేయడంతో కీలకపాత్ర వహించాడు. అయితే తనతో పని చేయించుకునే విషయంలో డైరెక్టర్లు ఎలా ఉండాలనే విషయాన్ని చెప్పుకొచ్చాడు అనిరుధ్.
రీసెంట్గా ఈ విషయాన్ని అనిరుధ్ వెల్లడించాడు. జైలర్ స్క్రిప్ట్ రాసుకున్నాక డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ అడిగింది ఒక సాంగే. అది కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫ్యామిలీ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ సాంగ్. రికార్డింగ్ కూడా అదే సాంగ్. షూటింగ్ కంప్లీట్ అయ్యాక రఫ్ కట్ చూశాక ఇంకో రెండు సాంగ్స్ పెట్టే ఛాన్స్ ఉందని అర్థమై మిగిలిన రెండు సాంగ్స్ ట్యూన్ చేసి ఓకే చేయించుకున్నాడు అనిరుధ్.
ఇది నెల్సన్ ఇచ్చిన స్వేచ్ఛ వల్లే జరిగిందని అనిరుధ్ చెప్పుకొచ్చాడు. లోకేష్ తాను ఏ మ్యూజిక్ ఇచ్చినా ఓకే చేస్తాడని, అట్లీ తన సినిమా కథను ఎక్స్ప్లైన్ చేసి వదిలేస్తాడని అందుకే తనకు స్పెషల్ గా ఇస్తానని అన్నాడు. అంటే తనకు ఫ్రీడమ్ ఇస్తే బెస్ట్ అవుట్‌పుట్ రాబట్టుకోవచ్చని అనిరుధ్ డైరెక్టర్లకు హింట్ ఇస్తున్నాడన్నమాట.













