ఓటీటీ రిలీజ్‌కు రెడీ అయిన యానిమల్
ఇండియన్ సినీ ప్రేక్షకులందరూ ప్రస్తుతం యానిమల్ ఓటీటీ రిలీజ్ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 1న రిలీజైన ఈ సినిమా బాలీవుడ్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్లలో చోటు దక్కించుకుంది. ఈ సినిమాతో తన టాలెంట్ ఏంటో మరోసారి బాలీవుడ్ ఆడియన్స్ కు తెలియచేశాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
యానిమల్ డిజిటల్ వెర్షన్ లో కట్ చేయని ప్రింట్ రిలీజ్ చేస్తానని ఆ మధ్య సందీప్ చెప్పడంతో యానిమల్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడొస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా యానిమల్ ని రిలీజ్ చేయాలని ఓటీటీ హక్కులు సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ మరో రెండ్రోజుల్లో రానుంది.
ఎలాగూ నార్త్ మల్టీప్లెక్స్‌ల రూల్ ప్రకారం సినిమా 45 రోజుల థియేట్రికల్ రన్ కూడా పూర్తవడంతో యానిమల్ ఓటీటీ రిలీజ్ కు ఎలాంటి బ్రేక్స్ లేవు. బాక్సాఫీస్ దగ్గర రూ.900 కోట్లు కొల్లగొట్టిన యానిమల్ ఓటీటీల్లో ఎలాంటి రచ్చ చేస్తుందో అని అప్పుడే డిస్కషన్స్ కూడా మొదలయ్యాయి. ఒరిజినల్ ప్రింట్ కావడంతో థియేట్రికల్ లో చూసిన ఫుటేజ్ కంటే మరో 10 నిమిషాలైనా ఎక్కువ రన్ టైమ్ఉం టుందని భావిస్తున్నారు.













