యానిమల్ పోస్ట్‌పోన్ తప్పేట్టు లేదుగా..
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా అందరి చూపును తన వైపుకు తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమా తర్వాత దాని హిందీ రీమేక్ కబీర్ సింగ్ తప్ప సందీప్ మరో సినిమా చేసింది లేదు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమాలో రణ్‌బీర్ మోస్ట్ యారొగెంట్ రోల్లో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. అంతేకాదు ఇందులోని కాస్టింగ్ కూడా మెయిన్ ఎట్రాక్షనే. హీరోయిన్ గా రష్మిక మందన్నా, విలన్ బాబీ డియోల్, పవర్ఫుల్ రోల్ లో అనిల్ కపూర్ ఇలా ఎన్నో ఎట్రాక్షన్స్ ఉన్నాయి.ఈ సినిమాను ముందుగా ఆగస్ట్ 11న రిలీజ్ చేయాలనుకున్నప్పటికీ ఇప్పుడు ఆ రిలీజ్ డేట్ కు సినిమా రావడం కష్టమేనంటున్నాయి ముంబై మీడియా వర్గాలు.
యానిమల్ పోస్ట్‌పోన్ కన్ఫర్మ్ అయ్యాకే అక్షయ్ కుమార్ ఓ మై గాడ్ ని అదే రిలీజ్ డేట్ కు షెడ్యూల్ చేసుకున్నారట నిర్మాతలు. ఇప్పటికైతే నిర్మాణ సంస్థ టి సిరీస్ యానిమల్ రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదు కానీ దాదాపు ఈ వార్త కన్ఫర్మ్ అని సమాచారం. ఆదిపురుష్ ప్రమోషన్స్, రిలీజ్ అయ్యాక ఈ నెలాఖరుకు యానిమల్ గురించి ఓ అప్డేట్ ఇవ్వనున్నారట.
అయితే యానిమల్ పోస్ట్ పోన్ న్యూస్ మిగిలిన పెద్ద సినిమాలకు చాలా రిలీఫ్ అనే చెప్పాలి. ఆగస్ట్ 10న రాబోతున్న జైలర్ కు థియేటర్ల టెన్షన్ ఉండదు. భోళా శంకర్ కు వేరే మార్కెట్ తో సంబంధం లేదు కాబట్టి అదేం పెద్ద సమస్య కాదు. ఇక గదర్ 2కు ఈ సినిమా పోస్ట్‌పోన్ చాలా ప్లస్ కానుంది. యానిమల్ చెప్పిన టైమ్ కు వచ్చుంటే మాత్రం అర్బన్ సెంటర్ లో గదర్ 2కు ఇబ్బందులొచ్చేవి. ఇప్పుడు ఆ సమస్య లేదు. మరి యానిమల్ పోస్ట్ పోన్ అయి ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే.













