హాయ్ నాన్న, ఎక్స్ట్రా మూవీలకు యానిమల్ భయం
హాయ్ నాన్న, ఎక్స్ట్రా మూవీలకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఎప్పుడూ లేనిది ఓ హిందీ నటుడి సినిమాకు టాలీవుడ్ లో విపరీతమైన బజ్ ఏర్పడింది. దానికి కారణం సందీప్ రెడ్డి వంగ. డిసెంబర్ 1న వస్తోన్న యానిమల్ సినిమా బుకింగ్స్ చూస్తుంటే మతి పోతుంది. కేవలం హైదరాబాద్లోనే కాదు, అన్ని ఊర్లలో ఇదే తంతు కనిపిస్తోంది.
ఎర్లీ మార్నింగ్ షో లకు సైతం ఫాస్ట్ ఫిల్లింగ్స్ పడుతున్నాయంటే యానిమల్ మానియా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోకస్ అంతా యానిమల్ పై ఉండటంతో నాని, నితిన్ సినిమాలను ఎవరూ పట్టించుకోవడం లేదు. హాయ్ నాన్న ట్రైలర్ చూసిన మాస్ ఆడియన్స్ ఇది మా వర్గం వారికి కాదేమోలే అని లైట్ తీసుకుంటుంటే, నితిన్ ఎక్స్ట్రా మూవీ సరైన ప్రమోషన్స్ లేక ఎవరూ పట్టించుకోవడం లేదు.
దీంతో నితిన్, నానికు యానిమల్ టెన్షన్ పట్టుకుంది. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ అయ్యాక ఆ సినిమా రిజల్ట్ ను బట్టి వాళ్లు ఊపిరి తీసుకుంటారా లేదా అనేది తెలియనుంది. యానిమల్ కు మంచి టాక్ వస్తే మాత్రం బాక్సాఫీస్ వద్ద ఊచకోత ఖాయం. కానీ ఇక్కడ హాయ్ నాన్న, ఎక్స్ట్రా సినిమాకు కలిసొచ్చే విషయం ఏంటంటే ఈ రెండు ఫ్యామిలీ సినిమాలు. యానిమల్ సినిమా ఫ్యామిలీస్ వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపరు. అలా అని ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే ఈ సినిమాలు చూస్తే బాక్సాఫీస్ వద్ద గట్టెక్కడం ఖాయం. మరి ఈ పరిణామాలను నితిన్, నాని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.













