Anil Ravipudi: అనిల్ నెక్ట్స్ టార్గెట్ అతనేనా?
టాలీవుడ్ లో రాజమౌళి(Rajamouli) తర్వాత ఫ్లాపే లేని డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు అనిల్ రావిపూడి(Anil Ravipudi). అనిల్ నుంచి సినిమా వస్తుందంటే చాలు ఆడియన్స్ అంతా థియేటర్లకు క్యూ కడతారు. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న రావిపూడి పటాస్(Patas) తో మొదలుపెట్టి ఆఖరిగా వచ్చిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) వరకు తన గ్రాఫ్ ను పెంచుకుంటూనే వెళ్తున్నాడు.
ప్రస్తుతం వెంకటేష్(Venkatesh) తో సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో వెంకీ ఫ్యాన్స్ ను ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడు. అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత అనిల్, మెగాస్టార్ చిరంజీవి(magestar Chiranjeevi)తో సినిమా చేస్తాడని తెలుస్తోంది. న్యూ ఇయర్ స్టార్టింగ్ లో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్సుంది.
ప్రస్తుతం విశ్వంభర(Viswambhara) షూటింగ్ లో బిజీగా ఉన్న చిరంజీవి, దాని తర్వాత అనిల్ తోనే సినిమా చేయనున్నాడని టాక్. ఇప్పటికే వెంకటేష్, బాలయ్య(Balayya)తో సినిమాలు చేసిన అనీల్, ఇప్పుడు చిరూతో కూడా రెడీ అయ్యాడు. చిరూ సినిమా తర్వాత అనిల్ టార్గెట్ నాగార్జునే(nagarjuna) అని తెలుస్తోంది. గతంలోనే వీరి కాంబోలో సినిమా వస్తుందన్నారు. కానీ ఎందుకో కుదరలేదు. చిరూ సినిమా తర్వాత అనిల్ తో మూవీ చేయడానికి నాగ్(NAg) కూడా ఇంట్రెస్ట్ చూపించే ఛాన్సుంది. ప్రస్తుతం కూలీ(Coolie), కుబేర(kubera) సినిమాల్లో నటిస్తున్న నాగ్, సోలోగా ఇప్పటివరకు ఏ సినిమాకూ కమిట్ అవలేదు. మరి నాగ్ తో సోలో సినిమా చేసే ఛాన్స్ అనిల్ అందుకుంటాడో లేదో తెలియాలంటే కొంత కాలం వెయిట్ చేయాల్సిందే.













