భగవంత్ కేసరి కోసం డైరెక్టర్ కొత్త స్ట్రాటజీ
బాలకృష్ణ సినిమాలంటే మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తెరకెక్కిస్తారన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాలయ్య నుంచి గతంలో వచ్చిన సినిమాలన్నీ దాదాపు అలాంటివే. అయితే ఇప్పుడు బాలయ్య చేస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి విషయంలో మాత్రం డైరెక్టర్ అనిల్ రావిపూడి ఓ స్పెషల్ స్ట్రాటజీతో ఫ్యాన్స్ ను ఎగ్జయిట్ చేస్తున్నారు.
ఇప్పటి వరకు భగవంత్ కేసరి నుంచి రెండు పాటలు రిలీజ్ కాగా అందులో ఏ పాట డ్యూయెట్ కాదు, మెలోడీ కాదు, స్పెషల్ సాంగ్ అంతకన్నా కాదు. రెండు పాటలు శ్రీలీల, బాలయ్య మధ్య బాండింగ్ గురించి చెప్పేవే. ఈ రెండు పాటల్లో వారిద్దరే ఉన్నారు. ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్, ఫ్యాన్స్ ను ఆకట్టుకునే కమర్షియల్ అంశాలు చాలానే ఉన్నప్పటికీ అనిల్ రావిపూడి ఈ సినిమాను ఓ ప్లానింగ్ ప్రకారం ప్రేక్షకుల మైండ్ లో రిజిస్టర్ చేస్తున్నాడు.
తను ప్రాణంగా పెంచుకున్న పాప కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్రలో బాలయ్య కనిపించనున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే సినిమాలో హీరోయిన్ కాజల్ కంటే శ్రీలీల పాత్రనే ఎక్కువగా ఉండేలా అనిపిస్తుంది. అసలు సినిమా ఎలా ఉండబోతుందన్నది ఈ వారంలో రిలీజ్ కాబోయే ట్రైలర్ చూస్తే ఓ క్లారిటీ రానుంది. కాగా భగవంత్ కేసరి సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.













