కలాం బయోపిక్ లో అనిల్ కపూర్ ?
బాలీవుడ్లో బయోపిక్‌ల పరంపర కొనసాగుతున్నది. తాజాగా భారత మాజీ రాష్ట్రపతి దివంగత అబ్దుల్ కలాం జీవిత కథ ఆదారంగా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కలాం పాత్రలో అనిల్‌కపూర్ నటించనున్నట్లు తెలిసింది. కలాం జీవితంపై రాజ్ చెంగప్ప రాసిన పుస్తకం ఆధారంగా ఈ సినిమాను రూపొందించబోతున్నారు. యావత్ భారతావనిని ప్రభావితం చేసిన మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం స్ఫూర్తిదాయక ఇతివృత్తంలో నటించే అవకాశం రావడంతో అనిల్‌కపూర్ ఈ సినిమాకు వెంటనే ఒప్పుకున్నారని చిత్ర బృందం తెలిపింది. ఈ బయోపిక్కు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర పూర్వనిర్మాణ పనులు జరుగుతున్నాయి.













