అంధాదున్ రీమేక్ లో రమ్యకృష్ణ
సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణ పాత్రలతో ప్రతిభను చాటుకుంటున్నది రమ్యకృష్ణ. త్వరలో తన విలనిజాన్ని చూపించడానికి సిద్ధమవుతోందామె. ఆయుష్మాన్‌ఖురానా, టబు ప్రధాన పాత్రల్లో నటించిన బాలీవుడ్ చిత్రం అంధాధున్. బతుకుతెరువు కోసం అంధుడిగా నటించిన ఓ పియానో ప్లేయర్ జీవితగమనంలో ఎదురైన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాల్ని దక్కించుకున్నది. ఈ చిత్రాన్ని తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేయబోతున్నారు. ఈ రీమేక్‌లో కీలక పాత్ర కోసం తొలుత అంధాదున్ లో నటించిన టబునే తీసుకోవాలని చిత్రబృందం భావించింది. అనివార్య కారణల వల్ల అమె అంగీకరించలేదని తెలిసింది. టబు స్థానంలో రమ్యకృష్ణను ఎంపికచేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భిన్న పార్శ్వాలతో కూడిన నెగెటివ్ రోల్ కావడంతో రమ్యకృష్ణ ఈ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. మేర్లపాట గాంధీ ఈ రీమేక్‌కు దర్శకత్వం వహిస్తున్నారు.













