కేరళకు సుమ దంపతుల బాసట
కేరళలో వరద బీభత్సానికి కకావికలమైన ఓ ఆరోగ్య కేంద్రం పునర్నిర్మాణానికి ప్రముఖ వ్యాఖ్యాత సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు ముందుకొచ్చారు. అలిప్పి జిల్లా కున్నుమ్మ ప్రాంతంలో శిథిలావస్థలోకి చేరిన ఆరోగ్య సంక్షేమ కేంద్రాన్ని వీరు నిర్మించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారు. కేరళ వరదల పరిస్థితులపై సుమ దంపతులు స్పందించారు. అలిప్పి జిల్లాల్లోని కన్నీటి గాథలపై చలించిన వీరు అక్కడి సబ్ కలెక్టర్ కృష్ణతేజను సంప్రదించారు. కేరళ ఆరోగ్య మంత్రి థామస్ ఐజాక్తోనూ ప్రత్యేకంగా మాట్లాడారు. తమ వంతుగా అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పునర్నిర్మిస్తామి ఈ సందర్భంగా వారు మాట ఇచ్చారు.













