Ananda Lahari: సురేశ్ ప్రొడక్షన్స్ (SP Mini) నుంచి గోదావరి సిరీస్ “ఆనందలహరి”

సురేశ్ ప్రొడక్షన్స్ మినీ (SP Mini) సగర్వంగా ప్రజెంట్ చేస్తున్న “ఆనందలహరి” (Ananda Lahari) తూర్పు, పశ్చిమ గోదావరి నేపథ్యంలో సాగే హార్ట్ టచ్చింగ్ ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ. ప్రేమ, నవ్వులు కలిపిన ఈ సిరీస్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించబోతోంది.
ఈ సిరీస్‌ను 13వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సాయి వనపల్లి రచన, దర్శకత్వం వహించగా, ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ ని విజనరీ సురేశ్ దగ్గుబాటి SP Mini (Suresh Productions Mini) బ్యానర్ పై సమర్పిస్తున్నారు.
SP Mini ద్వారా యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లకు తమ కథలు, ఆలోచనలను అత్యుత్తమ నాణ్యతతో రూపొందించడానికి అవకాశం కల్పించడం సురేశ్ బాబు లక్ష్యం. రామానాయుడు స్టూడియోస్ లో ఆధునిక సదుపాయాలతో ఈ కలను నిజం చేస్తోంది SP Mini.
ఆనందలహరిలో అభిషేక్ బొడ్డేపల్లి, బ్రమరాంబికా టుటిక ప్రధాన పాత్రల్లో నటించారు, జాయ్ సోలమన్ సంగీతాన్ని అందించారు. ఈ ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. రిఫ్రెషింగ్ టోన్, ప్లజెంట్ విజువల్స్ హ్యుమర్ తో సిరీస్ కోసం అంచనాలను పెంచింది.
ఈ దీపావళికి అక్టోబర్ 17న, AHAలో విడుదల కానున్న “ఆనందలహరి”తో గోదావరి కుటుంబాల ఆనందాలు, ఎమోషన్స్ ని మనసారా ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి.