Rekha: రీఎంట్రీ కి రెడీ అవుతున్న ఆనందం భామ
శ్రీను వైట్ల(Srinu Vaitla) దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఆనందం(Anandam)లో హీరోయిన్ గా నటించి ఎంతో మందిని మెప్పించిన కన్నడ భామ రేఖ(Rekha). ఆనందం తర్వాత దొంగోడు(Dongodu), ఒకటో నెం. కుర్రాడు(okato no. kurradu), జానకి వెడ్స్ శ్రీరామ్(Janaki weds Sriram) లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కనిపించిన రేఖ కొంతకాలానికి తెలుగు సినిమాకు దూరమై కనిపించకుండా పోయింది. కర్ణాటకకు చెందిన రేఖ చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చింది.
ఏ రకమైన బ్యాక్ గ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చిన రేఖకు ఆ సమయంలో కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా చాలానే ఆఫర్లు వచ్చాయి. కానీ 2014 తర్వాత రేఖ కొన్ని వ్యక్తిగత కారణాలు మరియు ఆరోగ్య సమస్యల కారణంగా ఇండస్ట్రీకి దూరమైంది. అలాంటి టాలెంటెడ్ భామ ఇప్పుడు తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇవ్వాలని డిసైడైనట్టు తెలుస్తోంది.
అందులో భాగంగానే టాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది రేఖ. నటిగా సవాలు చేసే పాత్రల కోసం రేఖ ఇప్పుడు వెతుకుందని తెలుస్తోంది. కేవలం సినిమాల్లోనే కాకుండా ఓటీటీ షోల్లో కూడా ఏదైనా పవర్ఫుల్ పాత్రలుంటే చేయడానికి రేఖ రెడీ అవుతుందట. ఆ కారణంతోనే రీసెంట్ గా తన పేరిట ఇన్స్టాగ్రమ్ అకౌంట్ ను కూడా ఓపెన్ చేసి దాని ద్వారా ఫ్యాన్స్ కు చేరువ అవ్వాలని చూస్తోంది రేఖ.







