ఆ మూవీ రిలీజెప్పుడు ఆనంద్?
బేబీ సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ. కావాల్సిన హిట్ పడింది, ఇంకేం తన తర్వాతి సినిమాలకు ఢోకా లేదనుకున్నారంతా. కానీ ఆనంద్ కు ఈ పాయింట్ అసలు కలిసిరావడం లేదు. ఆనంద్ హీరోగా రానున్న గం గం టీజర్ వచ్చి నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది మాత్రం ఇంకా చెప్పలేదు.
దానికి కారణం గం గం గణేషా బిజినెస్ డల్ గా సాగుతుండటమేనని తెలుస్తోంది. ఓటీటీ డీల్ కూడా ఇంకా సెట్ కాకపోవడంతో నిర్మాతలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆహా ఇంట్రెస్ట్ చూపిస్తున్నప్పటికీ నిర్మాతలు కోరిన రేట్‌ను ఆహా కోట్ చేయకపోవడం వల్ల సినిమా పెండింగ్ పడుతుందట.
ఈ సినిమాలో ఆనంద్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వంలో ప్రగతి శ్రీ వాత్సవ హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సత్యం రాజేష్ లాంటి ఆర్టిస్టులున్నప్పటికీ సినిమాకు హైప్ పెంచడంలో మాత్రం మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ కు నోచుకుంటుందో చూడాలి.













