భైరవను డామినేట్ చేసిన అశ్వత్థామ
ఎప్పుడెప్పుడొస్తుందా అని ఎదురుచూసిన కల్కి 2898ఏడీ సినిమా మొత్తానికి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చేసింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఫస్ట్ షో నుంచే మంచి పాజిటివ్ టాక్ దూసుకెళ్తుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ లాంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.
కల్కి సినిమాలో బౌంటీ హంటర్ గా ప్రభాస్ నటన అందరినీ మెప్పించింది. తన కామెడీ టైమింగ్ తో పాటూ యాక్షన్ సీక్వెన్స్ ల్లో కూడా ప్రభాస్ అదరగొట్టాడు. ఇక క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ కు ఇచ్చిన ట్విస్ట్ కు ఆడియన్స్ కు గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇదిలా ఉంటే ఈ సినిమాలో అమితాబ్ పోషించిన అశ్వత్థామ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్స్ ప్రభాస్ భైరవ కంటే ఎక్కువగా ఉన్నాయి.
యాక్షన్ సీన్స్ లో కూడా అమితాబ్, ప్రభాస్ ను చాలా ఈజీగా డామినేట్ చేసిట్లు చాలా క్లియర్ గా తెలుస్తోంది. నార్త్ లో అమితాబ్ పాత్రకు ఈ రేంజ్ ఎలివేషన్స్ ఇస్తేనే బాక్సాఫీస్ కళకళలాడుతుంది. దానికి తోడు అమితాబ్ చేసిన అశ్వత్థామ పాత్ర కథలో కీలకం కావడంతో సినిమాలో అదే ఎక్కువ హైలైట్ అయింది. ఈ వయసులో కూడా అమితాబ్ గొప్ప యాక్షన్ సీక్వెన్స్ ను చేసి ఆడియన్స్ ను ఆశ్చర్యపరిచాడు. ఏదేమైనా కల్కి వల్ల చాలా రోజుల తర్వాత థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తోంది.













