అమితాబ్‍బచ్చన్ రూ.2 కోట్ల విరాళం

బాలీవుడ్ సూపర్‍స్టార్ అమితాబ్‍బచ్చన్ ఢిల్లీలోని రకబ్‍గంజ్ గురుద్వారాలో ఏర్పాటు చేసిన కొవిడ్ కేర్ సెంటర్ కోసం రూ.2 కోట్లు విరాళం ఇచ్చారు. ఈ కేర్ సెంటర్‍లో ఆరోగ్య సేవల్ని ప్రారంభిస్తామని ఢిల్లీ సిఖ్కు గురుద్వారా మేనేజ్‍మెంట్ కమిటీ అధ్యక్షుడు మంజీందర్‍సింగ్ సీర్సా తెలిపారు. 300 పడకలతో ఏర్పాటైన ఈ కేంద్రంలో పేషెంట్లకు ఉచిత సేవలందిస్తామని ఆయన తెలిపారు. ఆక్సిజన్ కాన్‍సెంట్రేటర్లు, అంబులెన్స్ లను అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కేంద్రాల ఏర్పాటులో జరుగుతున్న పనులు గురించి అమితాబ్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని ఆయన అన్నారు. తమకు విరాళం ఇచ్చే సందర్భంగా సిక్కులు ఈ దేశానికి చేసిన సేవలకు తాను నమస్కరిస్తున్నానని అమితాబ్ అన్నారని ఆయన తెలిపారు.