Amitabh: మరో తెలుగు సినిమాలో అమితాబ్
బిగ్ బీ అమితాబ్ బచ్చన్(Amitabh Bachan) గత కొంత కాలంగా సౌత్ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. గతేడాది కల్కి(Kalki) సినిమాలో అశ్వథ్థామ పాత్ర చేసి హీరో ప్రభాస్ కంటే ఎక్కువ ప్రశంసలందుకున్న అమితాబ్, సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) వేట్టయాన్(Vettayan) లో హ్యూమన్ రైట్స్ లాయర్ గా కనిపించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు అమితాబ్ మరో సౌత్ సినిమాలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
రాహుల్ సాంకృత్స్యన్(Rahul Sankrithyan) దర్శకత్వలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) చేయనున్న పాన్ ఇండియా సినిమాలో అమితాబ్ ఓ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 1854-78 మధ్య కాలంలో నడిచే కథతో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో విజయ్ సరసన రష్మిక మందన్నా(Rashmika Mandanna) నటించనుంది.
భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం అమితాబ్ ను తీసుకుంటున్నట్టు టాక్. ఇవాళ పూజా కార్యక్రమాలతో మొదలైన వీడీ14(VD14) ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లనుంది. విజయ్ ఈ సినిమాలో చాలా భిన్న లుక్ లో కనిపిస్తాడట. సినిమా మొదటి షెడ్యూల్ విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ తోనే స్టార్టవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి(Vijay Thinnanuri) సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు.













