‘అమీర్‌పేట్ టు అమెరికా’ పోస్టర్ లాంచ్
రాధా మీడియా బ్యానర్‌పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు ఎ టు ఎ, అమీర్ పేట్ అమెరికా ఫస్ట్ పోస్టర్ నగర ప్రథమ పౌరుడు హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసివుద్దీన్ కలిసి రిలీజ్ చేసారు. ఈ చిత్రానికి కర్త, కర్మ, క్రియగా వున్న రామ్ మోహన్ కొమండూరి ఏ టు ఏ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని వినూత్నంగా డిజైన్ చేసారు. తెలంగాణకి రారాజు సీఎం కేసీఆర్ ఐతే అమెరికాకి రారాజు ట్రంప్ అంటూ తెలంగాణ నుండి అమెరికాకి ఎగురుతున్న విమానంతో కాన్సెప్ట్‌ని సూటిగా చెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని పలువురు ప్రశంసించారు. అమీర్ పేట్ టు అమెరికా పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారు. త్వరలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అరుణ్, జిల్ బాబు, ఎడిటర్: ప్రవీణ్ వూడి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, దర్శకుడు: చల్లా భానుకిరణ్.













