Agraharam lo Ambetkar: అగ్రహారంలో అంబేద్కర్ విజయం సాధించాలి!!- మందా కృష్ణ మాదిగ

మన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాల స్పూర్తితో రూపొందిన చిత్రం “అగ్రహారంలో అంబేద్కర్” (Agraharam lo Ambetkar). “దళిత సంచలనం” పద్మశ్రీ మందా కృష్ణ మాదిగ ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. కృష్ణచైతన్య (Krishna Chaitanya) ఎన్నో కష్టాలు పడి తెరకెక్కించిన ఈ చిత్రం అసాధారణ విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. అంబేద్కర్ అభిమానులైన ప్రతి ఒక్కరూ “అగ్రహారంలో అంబేద్కర్” చిత్రం చూసి తీరాలని పిలుపునిచ్చారు!!
ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో పురస్కారాలు అందుకున్న ఈ చిత్రాన్ని రామోజీ – లక్షమోజి ఫిల్మ్స్ పతాకంపై మంతా కృష్ణచైతన్య స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. హీరో కూడా ఆయనే కావడం విశేషం. ఆయన మాట్లాడుతూ…”అంబేద్కర్ భావజాలాన్ని విశ్వవ్యాప్తం చేయడమే లక్ష్యంగా తెరకెక్కిన ఈ చిత్రం టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన మందా కృష్ణగారికి బిగ్ బిగ్ థాంక్స్. ఈ చిత్రాన్ని సినిటేరియా మీడియా వర్క్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం, కుల మత ప్రాంత వర్గ వైషమ్యాలకు అతీతంగా సమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన అంబేద్కర్ కు గొప్ప నివాళిగగా.. ఎన్నో వ్యయప్రయాసలకు లోనై తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాం” అన్నారు!!