Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఎ.ఎం. రత్నం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )ని సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం (A.M.Ratnam) కలిశారు. హరిహర వీరమల్లు 9 Harihara Veeramallu) చిత్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించారు. 17వ శతాబ్దానికి సంబంధించిన కథతో రూపొందిన హరిహర వీరమల్లు గురించి ఆయన సీఎంతో చర్చించారని తెలిసింది. అలాగే తెలంగాణలో ఈ సినిమా టికెట్ ధర (Movie ticket price )ల గురించి కూడా ప్రస్తావించినట్లు తెలిసింది. తన విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎ.ఎం రత్నం కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా రాబోతున్న చిత్రం హరి హర వీరమల్లు. నిధి అగర్వాల్ కథానాయిక. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందిన ఈ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.