బన్నీ నెక్ట్స్ ఆ డైరెక్టర్‌తోనే!
పుష్ప సినిమాతో తన రేంజ్ ను దేశవ్యాప్తంగా తెలియచేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్పకు నేషనల్ అవార్డు కూడా రావడంతో పుష్ప2 విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. సుకుమార్ కూడా పుష్ప2 కోసం చాలానే టైమ్ తీసుకుని, ప్రతీ ఫ్రేమ్ పర్ఫెక్ట్ గా వచ్చేవరకు వెయిట్ చేసి మరీ తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత బన్నీతో సినిమాలు చేయడానికి చాలా మంది డైరెక్టర్లు లైన్ లో ఉన్నప్పటికీ, బన్నీ మాత్రం ఇప్పటికే త్రివిక్రమ్, సందీప్ రెడ్డి వంగ తో అఫీషియల్ గా సినిమాలు అనౌన్స్ చేశాడు. అయితే ఇప్పుడు బన్నీ ప్రియారిటీస్ మారినట్లు తెలుస్తోంది. పుష్ప2 తర్వాత బన్నీ అట్లీతో సినిమాను సెట్ చేసుకోనున్నాడని తెలుస్తోంది.
ఇప్పటికే ఈ కథకు సంబంధించిన డిస్కషన్స్ కూడా జరిగాయని, ఇద్దరూ కలిసి ఫైనల్ వెర్షన్ ని డిస్కస్ చేసుకున్నాక ఎప్పుడు సినిమాను స్టార్ట్ చేయాలన్నది డిసైడ్ అవుతారని తెలుస్తోంది. అట్లీ, షారుఖ్ తో సినిమా మరో సినిమా చేస్తాడనుకున్నారు కానీ ఆ స్క్రిప్ట్ ఇంకా రెడీ కాలేదట. అందుకే అట్లీ బన్నీతో ముందుకెళ్లాడని తెలుస్తోంది. అల్లు అర్జున్ తో అట్లీ చేసే సినిమా కమర్షియల్ గా ఉంటూనే బన్నీ ఇమేజ్ ను డబుల్ చేసేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. దీంతో ఎప్పుడెప్పుడు వీరిద్దరి కాంబోలో సినిమా తెరకెక్కుతుందా అని బన్నీ ఫ్యాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు.













